goodchance|ఇదే మంచి తరుణం..!
goodchance|ఇదే మంచి తరుణం..!
goodchance | వెంటనే కొనేయండి..
పసిడి నేలచూపులు
స్థిరంగా వెండి ధరలు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. ఇవాళ గోల్డ్ రేటు భారీగా తగ్గింది. వారం మొదటి రోజు సోమవారం (ఇవాళ) బంగారం ధరలు నేల చూపుచూశాయి. గత వారం చివరి రెండు రోజులు పైపైకి పోయిన రేట్లు మళ్లీ ఢమాల్ అన్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ విలువలోని హెచ్చుతగ్గుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం జోరుగా పెళ్లిళ్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు బంగారం ధర తగ్గడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధర తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. మళ్లీ ఎక్కడ ధర పెరుగుతుందోనని గోల్డ్ విక్రయానికి పరుగులు పెడుతున్నారు. దీంతో జ్యువెలరీ దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి.

సోమవారం ధరలు ఇలా ఉన్నాయి..10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 810తగ్గింది. 22క్యారెట్ల బంగారంపై రూ.750 తగ్గింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 20డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,512 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,47,280కు పడిపోయింది.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,35,000 వద్ద కొనసాగుతోంది.
