Congress |త్వరలోనే జిల్లా అధ్యక్షుల నియామకం..
Congress |త్వరలోనే జిల్లా అధ్యక్షుల నియామకం..
ఏఐసీసీ సెక్రటరీ సూరత్ సింగ్ ఠాకూర్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు త్వరలోనే రాష్ట్రంలో అన్ని జిల్లాల అధ్యక్షుల నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ఏఐసీసీ సెక్రటరీ సూరత్ సింగ్ ఠాకూర్ తెలిపారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షున్ని నియమించేందుకు ఏఐసీసీ నిర్ణయించిందన్నారు. పార్టీ పదవులు ఇవ్వడంలో పార్టీ జెండా మోసేవారే కాకుండా, గత కొంతకాలంగా పార్టీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటికే పలువురు దరఖాస్తులు అందాయని, ఈ నెల 27 వరకు శ్రీకాకుళంలోనే ఉంటూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుండి అభిప్రాయాలు సేకరించి, వాటిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నివేదిస్తానని చెప్పారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రెల్ల సురేష్, పేడాడ పరమేశ్వరరావు,అంబటి కృష్ణా రావు గోవింద మల్లిబాబు, బస్వా షణ్ముఖరావు, ఎం.చక్రవర్తి రెడ్డి, లఖినేన నారాయణ, పూడి కిరణ్, కె.వి.ఎల్.ఎస్. ఈశ్వరి, కరిమజ్జి మల్లేశ్వరరావు చాంద్ భాషా, లఖినేల సాయి,మంత్రి నరసింహమూర్తి బొచ్చ వెంకటరమణ తెంబూరు మధుసూదన్ రావు కొత్తకోట సింహాద్రి నాయుడు కొత్తకోట లక్ష్మి కోత మధు తులు వెంకట్ నాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
