Space | వాహ్‌.. స్పేస్ ఆన్ వీల్స్‌!

Space | వాహ్‌.. స్పేస్ ఆన్ వీల్స్‌!

  • అంత‌రిక్ష విజ్ఞాన వాహ‌నాన్ని సంద‌ర్శించిన వంద‌లాది విద్యార్థులు..

Space | విజయవాడ ,ఆంధ్రప్రభ : అంత‌రిక్ష రంగంలో భార‌త‌దేశ మైలురాళ్లు.. విజ‌య‌వంత‌మైన ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాలు.. ఉప‌గ్ర‌హ వాహ‌క నౌక‌లు.. ఇలా స‌మ‌స్త స‌మాచారాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు అందించే ‘‘స్పేస్ ఆన్ వీల్స్‌’’కు విశేష స్పంద‌న ల‌భించింది. ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా.జి.ల‌క్ష్మీశ చొర‌వ‌తో క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఈ నెల 23, 24వ తేదీల్లో అందుబాటులో ఉంచిన‌ ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్ మొబైల్ ఎగ్జిబిష‌న్‌ను వివిధ పాఠ‌శాల‌ల‌కు చెందిన వంద‌లాది విద్యార్థులు సంద‌ర్శించారు.

అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విదార్థులు, యువతలో ఉత్సుకతను పెంపొందించేందుకు ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానంపై సానుకూల దృక్పథాన్ని కల్పించేందుకు ఈ ప్ర‌ద‌ర్శ‌న ఎంత‌గానో దోహ‌ద‌ప‌డింది. సోమ‌వారం కూడా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్పేస్ ఆన్ వీల్స్‌ను సంద‌ర్శించి.. విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్పేస్ ఆన్ వీల్స్ ప్ర‌ద‌ర్శ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంద‌ని.

1960ల నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఇస్రో చేసిన ప్ర‌యోగాలు, ఉప‌గ్ర‌హ వాహ‌న నౌక‌లు, చంద్రయాన్, మంగళయాన్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ (ఐఆర్ఎన్ఎస్ఎస్‌) తదితర విషయాలపై పరిజ్ఞానాన్ని పెంచేలా ప్రదర్శనలు ఉన్నాయ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు. కార్యక్రమంలో షార్ టెక్నికల్ అధికారి కిరణ్ పాల్గొన్నారు.

Leave a Reply