Rs20 Crore Scam : కదిరిలో భూ మాయం Andhra Prabha Top Story
Rs20 Crore Scam : కదిరిలో భూ మాయం Andhra Prabha Top Story
- రికార్డులు తారుమారు
- యజమాని ప్లేస్ లో.. పరులు ప్రత్యక్షం
- రూ.20 కోట్ల భూమి రికార్డుల మాయాజాం
- రెవెన్యూ అధికారులపైనే అనుమానాలు
- కదిరిలో భారీ కుంభకోణం
(ఆంధ్రప్రభ , శ్రీ సత్యసాయి బ్యూరో)
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో భారీ భూ కుంభకోణం కలకం రేపింది. సుమారు రూ.20 కోట్ల విలువ చేసఏ 96 సెంట్ల భూమి యాజమాన్య రికార్డులు రాత్రికి రాత్రే మారిపోయింది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖ అధికారుల పాత్రపై గంభీర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Rs20 Crore Scam : ఇదీ బాధితుడి మొర

బాధితుడు సుబ్రహ్మణ్యం స్వామి ఆరోపణల ప్రకారం, మదనపల్లి రోడ్డులోని సర్వే నెంబర్ 960–6బిలోని తన పితృపారంపర్య భూమి ఆన్ లైన్ రికార్డుల్లో నుంచి అనూహ్యంగా మాయమైంది, ఇతరుల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ మార్పులు ఎలాంటి నోటీసు లేకుండా, విధి విధానాలను పక్కన పెట్టి జరిగాయని బాధితుడు వాదిస్తున్నారు. ఈ ఘటనపై వీఆర్వో, ఎమ్మార్వోలను సంప్రదించినప్పటికీ స్పష్టత లభించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం లేదా కావాలనే చేసిన చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా, ఈ మార్పులు రాజకీయ ఒత్తిడితో జరిగాయనే ఆరోపణలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికారులు లేదా రాజకీయ వర్గాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
Rs20 Crore Scam : మరిన్ని అబ్రకద్రబలు

ఇదే సమయంలో, సైదాపురం ప్రాంతంలో సర్వే నెంబర్ 90లో భూముల యాజమాన్య మార్పులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తమ పేర్లు రికార్డుల్లో అకస్మాత్తుగా మారినట్లు గుర్తించి ప్రశ్నించగా, “పొరపాటు జరిగింది” అనే సమాధానంతో అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంకా సర్వే నెంబర్ 20–1, 181 వంటి ప్రాంతాల్లో కూడా అనుమానాస్పద మార్పులు చోటుచేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇది కేవలం బయటపడిన భాగమేనని, లోలోపల మరింత పెద్ద స్థాయిలో అవకతవకలు జరిగి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల మున్సిపాలిటీ భూమి కబ్జా ఘటన, అనంతరం కమిషనర్ బదిలీ జరగడం వంటి పరిణామాలు కూడా ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి. రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం లోపమా, లేక వ్యవస్థాత్మక లోపాల ఫలితమా అన్నది తేలాల్సి ఉంది.
Rs20 Crore Scam : ఆఫీసర్ల నోళ్లకు తాళం
ప్రస్తుతం ఈ ఘటనపై బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. జిల్లా స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరిపి, భూ రికార్డుల మార్పుల వెనుక ఉన్న వాస్తవాలు వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారిక దర్యాప్తు ప్రారంభమవుతుందా? ఆరోపణలు నిజమా? లేక అపోహలేనా? అన్నది త్వరలో స్పష్టమవుతుందన్న ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు.
ASLO READ : Ayush College Vijayawada : ఆయుష్ ప్రొఫెసర్ సస్పెనన్షన్ ? Andhra Prabha News
ప్రస్తుతం ఈ ఘటనపై బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. జిల్లా స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరిపి, భూ రికార్డుల మార్పుల వెనుక ఉన్న వాస్తవాలు వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారిక దర్యాప్తు ప్రారంభమవుతుందా? ఆరోపణలు నిజమా? లేక అపోహలేనా? అన్నది త్వరలో స్పష్టమవుతుందన్న ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు
