Ritika Nayak | డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న మిరాయ్ బ్యూటీ

Ritika Nayak | డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న మిరాయ్ బ్యూటీ

శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ బ్యూరో): మాదక ద్రవ్యాల ప్రమాదం గురించి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పోస్టర్లను ప్రముఖ సినీ నటి రితికా నాయక్ సోమవారం ఆవిష్కరించారు. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన ఆమె, పట్టణంలోని జి.టి.రోడ్ వద్ద శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రగ్స్ వద్దు బ్రో, శక్తి యాప్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనలు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మార్గదర్శకాల మేరకు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాలపై ఈ పోస్టర్లను రూపొందించినట్లు రెండో పట్టణ ఇన్స్పెక్టర్ పి.ఈశ్వరరావు తెలిపారు. నటి రితికా నాయక్ చేతుల మీదుగా పోస్టర్ల ఆవిష్కరణ జరిపారు.

ఈ సందర్భంగా రితికా నాయక్ మాట్లాడుతూ, యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, కుటుంబం-సమాజం-రాష్ట్ర అభివృద్ధి కోసం డ్రగ్స్‌ కు ‘నో’ చెప్పాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన దిశగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని ఆమె ప్రశంసించారు. అదేవిధంగా పోలీసు శాఖ అందిస్తున్న శక్తి యాప్ సేవలను ప్రజలు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రెండవ పట్టణ సీఐ ఈశ్వరరావు, ఎస్సై లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply