స్వయ గణన ప్రతీ పౌరుని బాధ్యత

స్వయ గణన ప్రతీ పౌరుని బాధ్యత

  • జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం : స్వీయ గణన ప్రతి ఒక్క పౌరుని బాధ్యతని దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. భారత జనాభా గణనలో భాగంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి ఏడు రోడ్ల కూడలి వరకు ప్రచార వాహనం ద్వారా ప్రచారం చేస్తూ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5కె రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న ప్రజలందరూ స్వీయ గణనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

జనగణన-2027లో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ గణన ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రజలను కోరారు. ఈ నెల 16 నుండి 30 వరకు నిర్వహించే 15 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలు సె .సెన్సుస్ .గోవ్ .ఇన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతిరోజూ కనీసం 10 నుండి 20 మంది వ్యక్తులు స్వీయ గణన చేసుకునేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సెన్సస్ 5కె రన్ నిర్వహించుట వలన ప్రజల్లో చైతన్యం, విషయ పరిజ్ఞానం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ల ద్వారా ఇంకా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమైనదని ప్రతీ ఒక్క పౌరుడు భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు . ప్రతీ కుటుంబంలో ఒక వ్యక్తి స్వీయ గణన బాధ్యత తప్పకుండా తీసుకోవాలిని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మునిసిపల్ కమిషనర్, హెచ్. కూర్మారావు, జిల్లా రెవెన్యూ అధికారి, విశ్వేశ్వరరావు, వాకర్స్ క్లబ్, లైన్స్ క్లబ్ సభ్యులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు , సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply