క్షయ వ్యాధిని నివారిద్దాం – ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం!

క్షయ వ్యాధిని నివారిద్దాం – ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం!

జిల్లా వైద్యాధికారి కె.అనిత

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుండి స్థానిక ఏడు రోడ్ల కూడలి వరకు క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ, టి.బి. ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా టిబి నివారణకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.

జిల్లాలో 2.0 మిషన్లు, టిబి నాట్ మిషన్లు ఉన్నాయని ఈ వందరోజుల కార్యక్రమంలో భాగంగా 77 పంచాయితీలను 1000 మంది పాపులేషన్ లెక్కన తీసుకొని ఒకటి కంటే తక్కువ ఉన్న పంచాయతీలను టీవీ ముక్త పంచాయతీలుగా, ఒకటి లేక ఎక్కువ కేసులు ఉన్న పంచాయతీని సిల్వర్ పంచాయతీగా ఒకటి లేక సున్నా ఉన్న పంచాయతీలను గోల్డ్ పంచాయతీలుగా నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. ఈ వ్యాధి బారిన పడినవారు క్రమం తప్పకుండా ఆరు నెలలు మందులు వాడినట్లయితే వ్యాధి నివారణ జరుగుతుందని ఇందుకోసం టిబి సూపర్వైజర్లు ఉన్నారని, జిల్లాలో 9 యూనిట్లు ఉన్నాయని తెలిపారు.

క్షయ వ్యాధి (టీబీ ) నివారణపై ప్రజలకు అవగాహన కల్పించుట జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఇప్పటికి 506 కేసులు ట్రీట్మెంట్ లో ఉన్నాయని, టిబి కేసులు 12, టి.బి. హెచ్ఐవి కేసులు 12 ఉన్నట్లు తెలిపారు. క్షయ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చనని చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు.

ఈ వ్యాధి బారిన పడినవారు పోషకాహారం (పాలు, పండ్లు, కూరగాయలు)తీసుకోవాలని రోగ నిరోధక శక్తిని పెంచే అలవాట్లు పాటించాలని అన్నారు.టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రానికి వెళ్లాలని సూచించారు. ఈ టి.బి. వ్యాధి గ్రస్తులు సరైన మందులతో పాటు పోషకాహారం తీసుకోవాలని అందువలన ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా టి.బి రోగులకు వంద మందికి పోషకాహారం కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసి, ఎయిడ్స్,. టిబి. నివారణ అధికారి టి. శ్రీకాంత్, వైద్యాధికారులు, ప్రభుత్వ రిమ్స్, జేమ్స్ ఆసుపత్రి ( నర్సు) శిక్షణ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు మంత్రి వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply