మనసు పవిత్రత కోసమే ఉపవాస ప్రార్థనలు
మనసు పవిత్రత కోసమే ఉపవాస ప్రార్థనలు
- నర్సంపేట ఎమ్మెల్యే మంచి మాధవరెడ్డి
నర్సంపేట, ఆంధ్రప్రభ : రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు మనసు పవిత్రత చేసుకోవ డానికి దోహదపడుతుందని నర్సంపేట ఎమ్మెల్యే మంచి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో ఉన్న ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు శనివారం నిర్వహించారు. 50 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు, ప్లాట్ఫార్మ్ కు ఎమ్మెల్యే శిలాఫలకానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు,ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి,మంచి మార్గంలో నడవడానికి దోహదపడతాయని అన్నారు. మైనార్టీల సామాజిక,ఆర్థిక,విద్యా అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా మని తెలిపారు. కులమతాలకు అతీతంగా,నిరుపేద ముస్లింలకు అత్యధిక ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ముస్లిం సోదరులు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి,అందరి జీవితాల్లో ఆనందం,శాంతి, ఆరోగ్యం,ఐశ్వర్యం నిండాలని దొంతి ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి రామానంద్,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్, పట్టణ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్స్ లు తదితరులు పాల్గొన్నారు.
