నమిలిగొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

నమిలిగొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

  • ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
  • గ్రామ సర్పంచ్ కోమల ఐలోని

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సర్పంచ్ కోమల ఐలోని అన్నారు. ఇందుకోసం ప్రభు త్వ పథకాలతో పాటు గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. సోమవారం స్టేషన్ ఘన్‌ పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా సుమారు రూ.7 లక్షల వ్యయంతో గ్రామంలోని పలు కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్బంగా సర్పంచ్ పురుమా ని కోమల ఐలోని ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులతో కలిసి అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ పురు మాని కోమల ఐలోని మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమ ని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్య త ఇస్తూ రోడ్లు, పారిశుధ్యం, తాగునీరు వంటి సమస్యలను దశలవా రీగా పరిష్కరిస్తున్నామన్నారు. గ్రామంలోని ప్రతి కాలనీకి మెరుగైన రహ దారి సౌకర్యం కల్పించడం ద్వారా ప్రజలకు రాకపోకలు సులభం అవు తాయని పేర్కొన్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి గ్రామానికి అవసర మైన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పురుమాని రజాక్ యాదవ్, వార్డు మెంబెర్ లు పాలెపు సతీష్, దాసి రాజు, పెద్దా పూండ్రు రాజు, కందుకూరి లక్ష్మి, గుంటి రజిత, గాదె ప్రేమ్ కుమార్, గాదె శ్రీధర్, పాలెపు జ్యోతి, అర్షల అనురాధ, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply