పవర్ లేని గ్రంథాలయం. ..

పవర్ లేని గ్రంథాలయం. ..

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : డివిజన్ కేంద్రంలోని శాఖ గ్రంధాలయంలో సరఫరా నిలిచిపోయింది. తొర్రూరు శాఖ గ్రంధాలయం కు శాశ్వత అధికారి లేకపోవడంతో గ్రంథాలయంలో సమస్యలు తలెత్తుతున్నాయి కాగా తొర్రూరు గ్రంథాలయం కు ఇన్చార్జి గా పనిచేసిన శంకర్ ఇటీవల పదవి విరమణ పొందడంతో ఆయన స్థానంలో మరో అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి లైబ్రరేరియన్ కావడంతో ముఖ్య పట్టణమైన తొర్రూర్ గ్రంథాలయం కు వారానికి రెండు సార్లు విధులు నిర్వహిస్తుంటారు.

శాశ్వత శాఖ గ్రంథాలయ అధికారిని నియమించాలని పాఠకులు కోరుతున్నారు వేసవికాలం కావడంతో గ్రంథాలయం కు ఉదయం సాయంత్రం వివిధ పత్రికలు పుస్తకాలు చదవడానికి వచ్చే పాఠకులు గ్రంథాలయంలో విద్యుత్ సరఫరాకు సమస్య తలెత్తడంతో గ్రంథాలయంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది దీంతో పాఠకులు ఉక్కపోతకు గురవుతూ అవస్థలు పడుతున్నారు.

గ్రంధాలయంలో విద్యుత్ పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠకులు కోరుతున్నారు తొర్రూర్ శాఖ గ్రంధాలయం కు నిత్యం సుమారు 100 మందికి పైగా పాఠకులు వచ్చి వెళ్తుంటారు. ఇటీవల జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా నియమితులైన వారు జిల్లా గ్రంథాలయ కమిటీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి శాఖ గ్రంథాలయాలలో నెలకొన్న సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉందంటున్నారు.