అంకిరెడ్డిగూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ పథకం కింద మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులు సుర్వి రజిని మదన్ మోహన్ గౌడ్ (రాజు), నల్ల పార్వతమ్మ నరసింహ నేత, బడుగు పారిజాత రాములు నేత, చేపూరి సుగుణమ్మ సత్తయ్య, మోడెపు యాదమ్మ కుమార్ల నూతన గృహాలను సర్పంచ్ చేతుల మీదుగా ప్రారంభించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, గ్రామ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బత్తుల అనుష మహేష్ గౌడ్, దొడ్ల అండాలు శెట్టయ్యగౌడ్, రాపోలు రేణుక మల్లేష్, మాజీ సర్పంచ్ సుర్వి సత్తయ్య గౌడ్, యాట శంకరయ్య, ఐకేపీ మహిళా సంఘం అధ్యక్షురాలు పెండెం లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి గంగాపురం పాండుగౌడ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొత్త ఇండ్లలోకి అడుగుపెట్టిన లబ్ధిదారుల ఇండ్లలో పండుగ వాతావరణం నెలకొంది.
