మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న కేర్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. వైద్యుల ప్రత్యేక బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందిస్తోంది. మంత్రి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
