లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ..

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మండలంలోని దేవన్ పల్లి గ్రామంలో ఇటీవల మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం పంపిణి చేయడం జరిగిందని నాయకులు అన్నారు. మంజూరైన చెక్కుల లబ్ధిదారులు లకావత్ నరేష్ 28000/-,శివరాత్రి, నర్సయ్య 12000/- చెక్కులు పంపిణి చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం సహాయ నిధి చెక్కులు అందుకు లబ్ధిదారులు మాట్లాడుతూ.. ప్రవేట్ ఆస్పత్రిలో వైద్య చేయించుకొని సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు సహకారం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ లో మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఈరవత్రి,గ్రామ కాంగ్రెస్ పార్టీలకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే స్థానిక నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అభ్యర్థులకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎల్.శేఖర్,ఉప సర్పంచ్ సాయిలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగ అధ్యక్షుడు గోపాల్ నాయక్, జిల్లా గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎం.రాములు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రిగ్గు గంగాధర్, వార్డు మెంబెర్ బి.చిన్న గంగారాం, ఎం.పర్శరాములు గ్రామ కాంగ్రెస్ నాయకులు బి.గంగారాం, బుచ్చయ్య, వడ్ల రాము,డి.శంకర్, బి.సుదర్శన్ ఎం.రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply