బీజేపీ 47వ ఆవిర్భావ ఉత్సవాలు..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ఆదేశం మేరకు బీజేపీ 47వ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఇంటి వద్ద (హాస్పటల్ ముందు) బిజెపి జెండాను ఎగరవేయడం జరిగింది. వారివెంట బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.