సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ.
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని వాహన దారులకు కాలినడకన వెళ్ళేవాళ్లకు అంబలి త్రాగిపిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న దంపతులను శభాష్ అంటున్నారు, దండేపల్లి మండలంలోని మెదరిపేటలో సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో సత్యసాయి భక్తులు గుండా ప్రభాకర్ రమాదేవి దంపతులు గత17 రోజులుగా రోజుకు 10 నుండి 20 కిలోల వరకు పేదలకు జొన్న పిండి తో తయారు చేసిన అంబలి పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సత్యసాయి యాజ్ఞతో ప్రతి రోజు ఉదయం భజన కీర్తనలతో నగర సంకీర్తనలు నామస్మరణలు చేసుకుంటే ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం,అంతే కాకుండా పేదల దాహాన్ని తీర్చలనే ఆలోచనతో ఉచిత అంబలి పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ సత్యసాయి ఆశీస్సులు ఉండాలని కోరారు.
