Pandu-Master-Injured : అయ్యో పండూ Andhra Prabha Top News

Pandu-Master-Injured : అయ్యో పండూ Andhra Prabha Top News

  • ఢీ కొరియో గ్రాఫర్​ కు షాక్​
  • రెండు కాళ్లకు తీవ్రగాయాలు
  • మరో ఇద్దరు డాన్సర్లకు గాయాలు
  • అతి వేటంతో బొలెరో ఢీ
  • విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం

( ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో)

Pandu-Master-Injured

Pandu-Master-Injured : విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం లొడగలవానిపాలెం జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఢీ డ్యాన్స్​ మాస్టర్ పండు ​ సహా ముగ్గురు గాయపడ్డారు. డాన్స్​ మాస్టర్​ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Pandu-Master-Injured


అనకాపల్లి ప్రాంతానికి చెందిన ‘బాలు రైడర్స్’ డాన్స్ గ్రూప్ భీమిలి మండలంలో తగరపు వలసలో ఓ జాతరలో ఈవెంట్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
లొడగలవానిపాలెం వద్దకు వచ్చేసరికి కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు వాంతులు కావడంతో, కారును రోడ్డు పక్కన ఆపారు. వాహనంలోని వారంతా కిందకు దిగారు. కోళ్ల లోడ్‌తో అతివేగంగా వస్తున్న బొలెరో వ్యాన్, రోడ్డు పక్కన ఆగిప పండు మాస్టార్​ కారును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి అక్కడ ఆగి ఉన్న మరో వాహనం కూడా ప్రమాదానికి గురైంది.
కారు వెనుక భాగంలో నిలబడిన కొరియోగ్రాఫర్/డాన్స్ మాస్టర్ పండు (ఢీ ఫేమ్) రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు యువతులు కూడా గాయపడ్డారు. పండు మాస్టర్‌తో పాటు అక్కడ నిలబడిన లిఖిత ప్రియ, హారిక అనే ఇద్దరు యువతులకు కూడా గాయాలయ్యాయి.

Pandu-Master-Injured


ప్రమాదం జరిగిన వెంటనే తోటి ప్రయాణికులు, స్థానికులు స్పందించి పండు మాస్టర్‌ను మిగిలిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆనందపురం సీఐ వాసు నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వ్యాన్‌తో పాటు మిగిలిన రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Pandu-Master-Injured


బొలెరో వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జాతీయ రహదారి (NH-16) సిబ్బంది, పోలీసులు కలిసి ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, హైవేపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరింది.

ALSO READ : Devotee-Sudden-Death : స్వామి దర్శనం.. లోపే Andhra Prabha News