ఆయన చిరస్థాయిగా ఉంటారు..

ఆయన చిరస్థాయిగా ఉంటారు..
కమలాపూర్, ఆంధ్రప్రభ – ప్రముఖ కవి అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. అందెశ్రీ అకాల మరణానికి చింతిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నుంచి ఒక సంతాప ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తన సాహిత్యంతో తెలంగాణ ప్రజలను ఉద్యమం వైపు కదిలించి, స్వరాష్ట్ర ఉద్యమ సాధనలో అందెశ్రీ పాత్ర మరువలేనిదని అన్నారు. సాహితీ రంగం ఉన్నంత కాలం ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారని అన్నారు.
