Devotee-Sudden-Death : స్వామి దర్శనం.. లోపే Andhra Prabha News
Devotee-Sudden-Death : స్వామి దర్శనం.. లోపే Andhra Prabha News
- భక్తురాలు హఠన్మరణం
- మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విషాదం
( ఆంధ్రప్రభ, మోపిదేవి)
Devotee-Sudden-Death : కృష్ణాజిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తురాలు హఠన్మకఱం పొందింది, ఈ విషాదం బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు గ్రామానికి చెందిన మానుపాటి శ్రీదేవి (50) స్వామి దర్శనార్థం మంగళవారం రాత్రి దేవాలయంలో నిద్ర చేసింది. ఈరోజు తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు తోటి భక్తులు తేలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మోపిదేవి ఎస్ఐ గౌతమ్ కుమార్ తెలిపారు..
