ఈలప్రోలులో వ్యవసాయ శాఖ కమిషనర్ పర్యటన..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఈలప్రోలు గ్రామాన్ని వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ సమూన్ సోమవారం సందర్శించారు. గ్రామంలో సాగునీటి విధానాలు, వాతావరణ పరిస్థితులపై రైతులతో ముఖాముఖి చర్చించారు. గ్రామంలోని పీఏసీఎస్ ను సందర్శించి రైతు ఆధార్ ద్వారా ఎరువుల సరఫరా ఎలా జరుగుతుందో పరిశీలించారు. ఎరువులు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీశారు. ఎరువుల కోసం రైతులు యాప్ వినియోగంపై సుముఖత తెలిపారు.
రైతులందరూ పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని కోరారు. కౌలు రైతులు సీసీఆర్ సీ కార్డులు సకాలంలో తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల దేవి, సహాయ వ్యవసాయ సంచాలకులు ఫర్టిలైజర్ సెక్షన్ రాజన్, మైలవరం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాస్, టెక్నికల్ ఏవో స్వప్న, మండల వ్యవసాయ శాఖ అధికారి యడవల్లి రజని, సీఈవో పవన్, గ్రామ వ్యవసాయ సహాయకురాలు లాస్య, పీఏసీఎస్ చైర్మన్ వల్లూరు కిషోర్, టీడీపీ గ్రామ అధ్యక్షుడు కడియాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
