3K నడక పోటీలు
3K నడక పోటీలు
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా నిర్వహణ
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 3K నడక పోటీలు నిర్వహించారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ మైదానం నుంచి జలాల్ బంకు వరకు నిర్వహించిన ఈ నడక పోటీల్లో విద్యార్థులు, యువత, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడటంలో సైకిల్ వినియోగం, నడక వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.
