సమన్వయంతో కలిసి పని చేద్దాం..
- కూటమి అభివృద్ధిని ప్రజలకు వివరించాలి..
- పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి..
- ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన బుద్ధా వెంకన్న
- పశ్చిమ టీడీపీ ఇన్చార్జ్గా నియామకానంతరం తొలి భేటీ
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ టీడీపీ ఇన్చార్జ్గా ఇటీవల నియమితులైన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న శనివారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో బుద్ధా వెంకన్న ఎమ్మెల్యేకు బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి బుద్ధా వెంకన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ టీడీపీ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులతో సమన్వయంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
