కనకదుర్గమ్మని దర్శించుకున్న దర్శకుడు కొరటాల శివ, బాబీ
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని ప్రముఖ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. హిందూపూర్ శాసనసభ్యుడు ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న నూతన సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ సందర్భంగా విజయవాడకు విచ్చేసిన దర్శకులు కొరటాల శివ, బాబి కొల్లు లు గురువారం దేవాలయానికి రాగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దర్శకులు శివ, కొల్లు బాబి లకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య ఆలయ అధికారులు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.
