ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు.

ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు.
సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు…
దాబాకోట్ల బస్ స్టాప్..
బుడమేరు వంతెన వద్ద.
అయోధ్య నగర్ మాంగో ఫుట్పాత్..
పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టడం జరిగిందని ఏసీపీ ట్రాఫిక్ 3 శ్రీవేద అన్నారు. సోమవారం 6వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిదిలో ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. సింగ్ నగర్ దాబాకోట్ల బస్ స్టాప్,బుడమేరు వంతెన వద్ద,అయోధ్య నగర్ మాంగో ఫుట్పాత్,ప్రకాష్ నగర్ చేపల మార్కెట్, పాయకాపురం ఫిష్ మార్కెట్, కండ్రికలో పరీక్షల సెంటర్లగా ఉన్నాయి. ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం ఆదేశాల మేరకు, ఏసీపీ ట్రాఫిక్ 3 శ్రీవేద, సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఉదయం నుంచి సింగ్ నగర్ ఫ్లైఓవర్ వైపు వెళ్లి వచ్చే వాహనాలకు ఎంట్రీ ఎగ్జిట్ రోడ్డుపై ఉన్న ఎంక్రోచ్మెంట్ను తొలగించి, అక్కడి వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఫ్లైఓవర్కి రెండు వైపులా ..(డాబాకోట్లు,ఆర్.కె పురం వద్ద ) సిటీ బస్సులు ఆగి ప్రయాణికులను సురక్షితంగా ఎక్కించుకొనే విధంగా బారికేడ్ ఏర్పాటు చేసి, ప్రతి రోజూ సిటీ బస్సులు అన్ని ఈ బ్యారికేడింగ్లోనే ఆగి ప్రయాణికులను ఎక్కించుకునే విధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ల అందరికీ తెలియపరచారు.అదే సమయంలో మిగిలిన అన్ని ఇతర వాహనాలు సజావుగా ఫ్లైఓవర్ పైకి వెళ్లిపోయే విధంగా, ఫ్లైఓవర్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వుండే విధంగా చర్యలు తీసుకున్నామని 6వ ట్రాఫిక్ సింగ్ నగర్ సీఐ ప్రభాకర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
