నిందితుడిపై 9 కేసులు. -సీఐ ప్రవీణ్ కుమార్ వెల్లడి.
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు
పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి బస్టాండ్ సమీపంలో జరిగిన ద్విచక్ర వాహన చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. గురువారం పోలీస్ స్టేషన్ లో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెద్దపల్లి భరత్‌నగర్‌కు చెందిన మామిడిపల్లి ప్రదీప్ ఈ నెల 20న తన ద్విచక్ర వాహనాన్ని పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఫార్మసీ ముందు పార్క్ చేసి మంథనికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై కేసు నమోదు చేసిన పెద్దపల్లి టౌన్ ఎస్ఐ కె. నరేష్ సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 29న చీకురాయి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రాజక్కపల్లి జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెందిన రాజక్కపల్లికి చెందిన రంగు గంగాధర్ ను దొంగిలించిన బైక్‌తో పాటు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడిపై ఇప్పటికే తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ కె. నరేష్, పోలీసు సిబ్బంది ప్రభాకర్, సతీష్ లను పెద్దపల్లి సీఐ కె. ప్రవీణ్‌కుమార్ అభినందించారు.
