Reserve | ఎఫ్డీపీటీ వాహనాన్ని అడ్డుకున్న ఇండ్ల లబ్ధిదారులు

Reserve | ఎఫ్డీపీటీ వాహనాన్ని అడ్డుకున్న ఇండ్ల లబ్ధిదారులు
Reserve | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లి కొమురం భీమ్ చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం మంచిర్యాల సీఎఫ్, కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ శాంతారాం వాహనాన్ని పలువురు ఇందిర ఇళ్ల లబ్ధిదారులు అడ్డుకున్నారు. కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన వాహనంతో ఫీల్డ్ పరిశీలనకు వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న మండలంలోని ఇందనపల్లి, మొర్రిగూడ, మురిమడుగు గ్రామాలకు చెందిన పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ ఇండ్లకు గ్రామాల సమీపాలలోని వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చుకుంటే ఆ ఎఫ్డీపీటీ ఆదేశించడంతోనే స్థానిక అటవీ అధికారులు ఆ ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని కేసులు చేస్తూ, ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆ మార్గం గుండా వచ్చిన ఎఫ్డీపీటీ వాహనాన్ని కొమురం భీమ్ చౌరస్తా వద్ద అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. లక్ష్మీనారాయణ కల్పించుకొని ఆ అధికారి ఆదేశాల మేరకు జన్నారంలోని ఎఫ్డీఓ కార్యాలయానికి ఆ లబ్ధిదారులందరూ రావాలని నచ్చ చెప్పారు.
