అధ్యక్షులు దాసరి ఎల్లయ్య ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామంలో మేడే ఉత్సవాలు సిఐటియు అనుబంధ తాపీ యూనియన్ సంఘం అధ్యక్షులు దాసరి ఎల్లయ్య ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అధ్యక్షులు దాసరి ఎల్లయ్య జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎల్లయ్య మాట్లాడుతూ.. అమెరికాలోని చికాగో నగరంలో 18 గంటల పని దినాన్ని తగ్గించి 8 గంటల పని దినాల కోసం హే మార్కెట్ ఆవరణలో కార్మికులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులు కార్మికులపై కాల్పులు జరపడంలో 8 మంది కార్మికులు అమరులైనారు.

ఆ అమరుల రక్తంతోనే నేడు ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కుల కోసం మేడేను జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దేశంలో పాలిస్తున్న నాయకులు బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు కార్మిక చట్టాలను అనుకూలంగా చేస్తూ ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమదోపీడికి గురి చేస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో కార్మికులందరూ కార్మిక వ్యతిరేక నల్ల చట్టాల రద్దుకై పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చరు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాచర్ల శంకర్, కార్యదర్శి మాంకాల సారయ్య, కోశాధికారి మంగి యాకయ్య, గౌరవ అధ్యక్షులు లక్ష్మయ్య , గ్రామ సర్పంచ్ యాసాడి బాలాజీ రెడ్డి, ఉప సర్పంచ్ ఎడ్ల వెంకన్న , నాగలి వెంకన్న సట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply