వడ దెబ్బకు ఉపాధి హామీ కూలి మృతి..
కోనరావుపేట, ఆంధ్రప్రభ ; రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన షేక్ హైదర్( 56) శుక్రవారం మామిడిపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ కూలి పనికి బతుకుదెరువు నిమిత్తం వేళాడు. ఎండలు ఎక్కువ ఉన్నందున ఎండ దెబ్బ తగిలి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తీవ్ర అస్వస్థకు గురికాగా అతని భార్య మున్నిబి చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తీసుకెళ్ళింది. షేక్ హైదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు శుక్రవారం రాత్రి మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.మృతుడీకి భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
