Arya Vaishya Sangham | సామాన్యుడికి పట్టం…
Arya Vaishya Sangham | సామాన్యుడికి పట్టం…
- పట్టణ అధ్యక్షుడిగా సదానందం
- 172 ఓట్ల భారీ మెజారిటీ
పెద్దపల్లి ఆంధ్రప్రభ : ఆర్యవైశ్య సంఘం పెద్దపల్లి పట్టణ శాఖ నూతన అధ్యక్షుడిగా సామాన్యుడికి పట్టం కట్టారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో పట్టణ శాఖ అధ్యక్ష స్థానం కోసం పోలింగ్ నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి ఓజ్జల సదానందం, మంచాల వరప్రసాద్, బోడ్ల రమేష్ లు పోటీపడ్డారు.
ఎన్నికల అధికారిగా న్యాయవాది బాదం రమేష్, కన్వీనర్ గా కొమురవెల్లి రాజేందర్ లు వ్యవహరించారు. పోలింగ్ లో 776 మంది ఆర్యవైశ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓజ్జల సదానందం 467 కు ఓట్లు రాగా, మంచాల వరప్రసాద్ కు 295 ఓట్లు, బొడ్ల రమేష్ కు 11 ఓట్లు వచ్చాయి.
3 ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో ఓజ్జల సదానందం 172 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సదానందం గెలుపు అనంతరం ఆయన మద్దతుదారులు నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు. సంబరాల్లో పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో కష్టపడే వ్యక్తిత్వం, సంఘం అభివృద్ధికి సదానందం సరైన వ్యక్తి అని భావించిన పట్టణ ఆర్యవైశ్యులు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
172 ఓట్ల భారీ మెజారిటీ తో గెలిపించారు. అనంతరం నూతన అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తన గెలుపులో భాగమైన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
