కిరాణా దుకాణల లో మద్యం పొగాకు ఉత్పత్తులు నిషేధం..

గ్రామపంచాయతీ కీలక తీర్మానం..
ఉల్లంఘిస్తే జరిమానా..

ఎల్కతుర్తి ,ఆంధ్రప్రభ : గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అంబాల రాజు కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామంలోని కిరాణా దుకాణాల్లో మద్యం పొగాకు ఉత్పత్తులు ప్రాణాంతక నిషేధిత వస్తువుల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అంబాల రాజు కుమార్ మాట్లాడుతూ గ్రామంలో నిషేధిత వస్తువులను విక్రయించిన వారిపై రూ.20,000 జరిమానా విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే అలాంటి విక్రయాలను గుర్తించి గ్రామపంచాయతీ దృష్టికి తీసుకువచ్చిన వారికి ప్రోత్సాహకంగా రూ.5,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు వెల్లడించారు.

గ్రామ ప్రజల ఆరోగ్యం యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఈ నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని గ్రామపంచాయతీ పాలకవర్గం పేర్కొంది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గబ్బేటి స్వామి, ఉపసర్పంచ్ కోరే లావణ్య, వార్డు సభ్యులు కడారి సుధాకర్, నక్క రాకేష్, కడారి విమేజా, అంగన్వాడి టీచర్ ఎడ్ల రజిత, ఆశ వర్కర్ కడారి మాధవి, గ్రామ వివో అధ్యక్షురాలు గొర్రె శ్రీలత, సిఏ తాడూరి సుమలత, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కడారి రాజారాం, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అంబాల రమేష్, కోరే ఐలుమల్లు, నక్క వనమ్మ, రజిత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.