ఘనంగా శ్రీ కంట మహేశ్వరుని కల్యాణ మహోత్సవం

శ్రీ కంట మహేశ్వరుని కల్యాణ మహోత్సవం
- జలబిందెలతో గౌడ కులస్తుల ప్రదర్శన
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని బిక్కేరు వాగు గుంటి గౌడ కులస్థులు శనివారం నిర్వహించిన శ్రీ కంట మహేశ్వర స్వామి కల్యాణ మహోత్సవ వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కేంద్రం నుండి డప్పుచప్పుళ్లతో జలబిందెలు నెత్తిన పెట్టుకొని ప్రదర్శన గా బిక్కేరు ఒడ్డున ఉన్న ఆలయానికి తరలివెళ్లారు.
ఆలయం చుట్టూ గౌడ కులస్తులు జలబిందెలతో ప్రదక్షిణ చేసిన అనంతరం జెట్టి పూజారులు నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బుర్ర క్రిష్ణ,ఆకుల శ్రీనివాస్,బుర్ర రాములు,యాదయ్య, గనగాని చంద్రయ్య,బుర్ర సత్తయ్య, రమేష్,నర్సయ్య,శ్రీనివాస్,రవి వెంకన్న,మధు,ధబ్బేటి సోంబాబు, కారుపోతుల శ్రీనివాస్, బీసు సోమయ్య, శ్రీను,భాస్కర్,కానుగు రాజు,నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
