DCP Dhara Kavitha | నేరాల నియంత్రణపై ఫోకస్ చేయండి

DCP Dhara Kavitha | నేరాల నియంత్రణపై ఫోకస్ చేయండి
- రోడ్డు ప్రమాదాలు, చోరీలను నియంత్రించండి
- రౌడీషీటర్లు, భూ కబ్జాదారుల ఆటకట్టించాలి
- సంఘ విద్రోహశక్తులపై కన్నేయండి
- వృద్ధుల సమస్యలను తీర్చండి
- పోలీస్ ఇమేజ్ పెంచేరీతిలో పనితనం ప్రదర్శించాలి
- సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత
- మడికొండ ఠాణాను తనిఖీ చేసిన సెంట్రల్ జోన్ డిసిపి
DCP Dhara Kavitha | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : నేరాల నియంత్రణపై పోలీసులు ఫోకస్ చేయాలని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత ఆదేశించారు. హైవే రోడ్లపై రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలు చేపట్టడం, చోరీల కట్టడికై పక్కాగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రౌడీషీటర్లు, భూ కబ్జాదారుల ఆట కట్టించాలని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత పేర్కొన్నారు. మడికొండ పోలీస్ స్టేషన్ ను ఇవాళ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత వార్షిక తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల (Police Station) వారీగా పోలీస్ అధికారులంతా సంఘ విద్రోహశక్తులపై కన్నేయాలని
సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత సూచించారు.

ముఖ్యంగా ఠాణాలకు వచ్చి ఫిర్యాదులు చేసే వృద్ధుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలన్నారు. పోలీస్ సిబ్బంది అంతా పోలీస్ ఇమేజ్ పెంచే రీతిలో పనితనం ప్రదర్శించాలని ఉద్బోధించారు. మడికొండ పోలీస్ ఇన్ స్పెక్టర్ పుల్యాల కిషన్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డిలు డీసీపీ ధార కవితకు పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్ ను సెంట్రల్ జోన్ డీసీపీ కవిత తనిఖీ చేశారు. అలాగే స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. డీసీపీ (Dcp) ఠాణా ఆవరణలో మామిడి చెట్టును నాటారు. అనంతరం స్టేషన్ లో ఉన్న అన్ని గదులను, మెయింటనెన్స్ ను పరిశీలించారు. గత మూడు సంవత్సరాల నేరాలకు సంబంధించిన రికార్డులను, కేసుల వివరాలను తెలుసుకొన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, నివారణ కోసం తీసుకున్న చర్యల గూర్చి వివరాలు ఆరా తీశారు.

విధి నిర్వహణలో పోలీస్ సిబ్బందికి ఉన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత హామీ ఇచ్చారు. సమాజంలో పోలీసుల గౌరవ, మర్యాదలు పెంచే రీతిలో సిబ్బంది పనితీరు కొనసాగించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. నిత్యం శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఠాణాకు వచ్చే ప్రతి చిన్న సమస్యపై ప్రతిస్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. నేర నియంత్రణ విషయంలో పోలీస్ ఆఫీసర్స్ (Police Officers) రాజీ పడొద్దని ఆదేశించారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్స్ ఉన్న వ్యక్తులపై నిరంతరం నిఘా వేయాలని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత ఆదేశించారు. ఈ వార్షిక తనిఖీల్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, మడికొండ ఇన్స్ పెక్టర్ పుల్యాల కిషన్, ఎసై లు రాజబాబు, రాజ్ కుమార్, రామ్ మోహన్, మడికొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



