200-men-under-search : ట్విస్టులే ట్విస్టులు Andhra Prabha Top Story

200-men-under-search : ట్విస్టులే ట్విస్టులు Andhra Prabha Top Story

  • జాడలేని చిన్నారి జాహ్నవి
  • 200 మంది పోలీసులు
  • స్పెషల్​ పార్టీలు.. ఎస్డీఆర్​ ఎఫ్​ దళాలు…
  • ఏడో రోజూ కనీసం దొరకని క్లూ
  • డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌తో అడవిలో జల్లెడ
  • పెంపుడు కుక్కపై వైరల్ ప్రచారానికి చెక్
  • టవర్ డంప్, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన
  • ఆచూకీ తెలిపితే రూ.1 లక్ష నజరానా
  • కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు

( ఆంద్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్​)

క200 మంది పోలీసులు, స్పెషల్​ పార్టీ, SDRF బలగాలు యావత్తూ చిన్నారి జాహ్నవి .జాడ కోసం జల్లెడ పట్టినా.. ఏడో రోజు కూడా కనీసం చిన్న క్యూ దొరకలేదు. సీహెచ్ అగ్రహారం సమీపంలోని 500 నుండి 1,000 ఎకరాల దట్టమైన పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాలను డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ సాయంతో నిరంతరం గాలిస్తున్నారు. ఈ లోపు తాజా ట్విస్ట్ కలవరం సృష్టించింది. చిన్నారి పెంపుడు కుక్క చని పోయినట్టు మీడియాలో విపరీత ట్రోల్​ జనాన్ని కలవరపెట్టింది. కానీ ఆ కుక్క చావలేదు. కేవలం తప్పుడు ప్రచారమని పోలీసులు అధికారులు దృవీకరించారు. నిజానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఆ కుక్కను అడవిలోకి వదిలారు. దాదాపు 8 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో ఈ కుక్క తిరిగింది. పోలీసులు దాని వెంటే డాగ్ స్క్వాడ్, డ్రోన్లతో వెళ్లినప్పటికీ, దట్టమైన పొదలు కొండ ప్రాంతం కారణంగా పాప ఆచూకీకి ఖచ్చిత ఆధారాలు ఇంకా లభించలేదు.

200-men-under-search : టెక్నాలజీతో.. బిజీబిజీ

పోలీసులు కేవలం గాలింపుపైనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్ల టవర్ డంప్ (Tower Dump) విశ్లేషణ అనుమానితుల కాల్ డేటా రికార్డులను (CDR) పోలీసులు క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నారు..కిడ్నాప్ (అపహరణ) కోణాన్ని నిర్ధారించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలలోని ప్రధాన మార్గాలు, తుని రైల్వే స్టేషన్ , బస్టాండ్లలోని సీసీ కెమెరాల (CCTV) దృశ్యాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చిత ఆధారాలు దొరకలేదని పోలీసులు తెలిపారు

200-men-under-search : ఆచూకీ చెబితే ₹ లక్ష నజరానా

దాదాపు 200 మందికి పైగా పోలీసు సిబ్బంది, SDRF బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాల సహాయంతో చుట్టుపక్కల 500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని, పామాయిల్ తోటలను జల్లెడ పడుతూనే .. చిన్నారి ఆచూకీ తెలిపితే తుని రూరల్ పోలీసులు రూ. 1 లక్ష నజ.రానా ప్రకటించారు. చిన్నారి ఆచూకీని ఖచ్చిత సమచారం తెలిపిన వారికి లేదా గుర్తింపునకు రూ. 1,00,000 (అక్షరాలా ఒక లక్ష రూపాయలు) నగదు బహుమతిని అందజేస్తామని జిల్లా పోలీసు శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంటాయని పోలీసులు స్పస్టం చేశారు, కిడ్నాప్ ముఠాల కోణంలోనూ దర్యాప్తు కొసాగుతోంది. సరిహద్దు జిల్లాల పోలీసులను =, అంతరాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టులను కూడా అప్రమత్తం చేశారు.

200-men-under-search : కిడ్నాప్​ కోణంలో…

కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జాహ్నవి అదృశ్యమైన కేసు వారం రోజులు గడుస్తున్నా ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. పెంపుడు కుక్కకు జీపీఎస్ (GPS) ట్రాకర్ ఆపరేషన్​చేపట్టారు, జాహ్నవి తో పాటు అడవిలోకి వెళ్లిన పెంపుడు కుక్క కొద్దిరోజుల కిందట ఒక్కటే సురక్షితంగా తిరిగి వచ్చింది. ఆ కుక్కే చిన్నారి వద్దకు దారి చూపిస్తుందనే ఆశతో పోలీసులు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ (GPS Tracker) అమర్చారు. కుక్క కదలికలను నిశితంగా పరిశీలిస్తూ అడవిలో గాలించినప్పటికీ, ఈ ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
పాప అడవిలో తప్పిపోలేదు, ఎవరో కిడ్నాప్ చేశారనే కోణంపై పోలీసులు ఇప్పుడు దృష్టి పెట్టారు. ఇందుకు కంచె ప్రధాన కారణంగా కనిసిస్తోంది. పామాయిల్ తోట చుట్టూ మనుషులు కూడా దాటలేనంత బలమైన కంచె ఉంది. అంత చిన్న పాప ఒంటరిగా ఆ కంచెను దాటి వెళ్లడం అసాధ్యమని భావిస్తున్నారు. తోట దాటిన తర్వాత 100 మీటర్ల ఎత్తున్న కొండ, దట్టమైన పొదలు ఉన్నాయి. పెద్దవాళ్లే వెళ్లలేని ఆ ముళ్ల తుప్పల్లోకి మూడేళ్ల పాప వెళ్లలేదు. దుర్వాసన లేకపోవడం: ఒకవేళ అడవిలో జరగరానిది ఏమైనా జరిగి ఉంటే వారం రోజుల్లో దుర్వాసన లేదా వన్యమృగాల జాడలు తెలిసేవి. కానీ 500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా అలాంటి ఆధారాలేవీ దొరకలేదు. బాలిక తల్లిదండ్రులు, తోట యజమానులు చుట్టుపక్కల అనుమానితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు .