Operation Final Strike : మావోయిస్టులకు మహా దెబ్బ Andhra Prabha Spl News

Operation Final Strike : మావోయిస్టులకు మహా దెబ్బ Andhra Prabha Spl News
- రహస్య ఆయుధాల తయారీ ధ్వంసం
- గడ్చిరోలీలో కలకలం
- ఆలస్యంగా వెలుగులోకి..
( ఆంధ్రప్రభ, చర్ల )

Operation Final Strike : మహారాష్ట్రలోని గడ్సిరోలీలో ల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. “ఆపరేషన్ ఫైనల్ స్ట్రైక్”లో లొంగిపోయిన మావోయిస్టుల నుంచి అందిన కీలక సమాచారంతో,, అడవుల్లోని మావోయిస్టుల రహ స్య ఆయుధాల తయారీ కేంద్రాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, మావోయిస్టులు ప్రభుత్వ వ్యతిరేక చర్యలు, భద్రతా బలగాలపై దాడులు, ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలకు ఉపయోగించేందుకు అడవుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఇతర సామగ్రిని రహస్యంగా డంపుల్లో దాచారు. ఈ నేపథ్యంలో మే 16న లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచారంతో పోంకెన్–బినగుండా అటవీ ప్రాంతంలో ఈ డంప్ ను గుర్తించారు. మే 21న జిల్లా ఎస్పీ ఎం. రమేష్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, ప్రాణహిత దళం, బాంబు నిర్వీర్య దళం (BDDS)లకు చెందిన ఎనిమిది బృందాలు అడవిలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. మే 22న అడవిలోని ఒక రహస్య స్థావరాన్ని గుర్తించిన పోలీసులు లాత్ మెషిన్, బీజీఎల్ పైపులు, 12 బోర్ పైపులను ధ్వంసం చేశారు.
