ఏసీబీ వలలో డీఏఈ
ఏసీబీ వలలో డీఏఈ
రూ.15వేలకు కక్కుర్తి
( ఆళ్లగడ్డ, ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా (Nandyal District)లో ఓ లంచగ్రస్తుడిని అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Department) పట్టేసింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ (Allagadda) పరిధిలోని రోడ్లు భవనాల శాఖ (Roads and Buildings Department)డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ దూదేకుల దస్తగిరి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB officials) పట్టేశారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు, ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వర్క్ చేయటానికి కాంట్రాక్టర్ నుంచి ఏఈ దస్తగిరి 55 వేలు లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు రమేష్ మొదట రూ.40 వేలు ఇచ్చారు. మరో 15 వేల కోసం అసిస్టెంట్ ఇంజనీర్ దస్తగిరి (Assistant Engineer Dastagiri)
పట్టుబట్టారు. ఇక లంచం ఇచ్చేందుకు ఇష్టం లేక కాంట్రాక్టరు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏసీబీ వల పన్ని దస్తగిరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొంది. ఈ మేరకు దస్తగిరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
