23rdJuneeditorial | రాజకీయ సుస్థిరత లేకుంటే బ్రిటన్ భవిష్యత్తు ఏమిటి?
23rdJuneeditorial | రాజకీయ సుస్థిరత లేకుంటే బ్రిటన్ భవిష్యత్తు ఏమిటి?
23rdJuneeditorial | కీర్ స్మార్టర్ రాజీనామాతో కొత్త రాజకీయ సమీకరణాలు
బ్రెక్సిట్, ఆర్థిక సంక్షోభం బ్రిటన్‌ను ఎలా ప్రభావితం చేశాయి?
అండీ బర్న్‌హామ్ ముందున్న ప్రధాన సవాళ్లు
23rdJuneeditorial | బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల క్రితం ఆయన లేబర్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి అధికారంలోకి వచ్చారు. సుస్థిర పాలన సాగుతుందని అంతా భావించారు. గత పదేళ్లలో బ్రిటన్‌కు ఏడుసార్లు ప్రధానులు మారడం రాజకీయ అస్థిరతకు అద్దం పడుతోంది.
బ్రిటన్‌ను తిరిగి ఆర్థిక పునరుద్ధరణ వైపు నడిపిస్తారని స్మార్టర్‌పై అందరూ ఆశలు పెట్టుకోగా, స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ అంతర్గత సమస్యలతో, కొట్టుమిట్టాడుతుండగా, దేశం ఆర్థిక సవాళ్లు, ఇమ్మిగ్రేషన్ సమస్యల్లో చిక్కుకుంది. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ అండీ బర్న్‌హామ్ అనూహ్యంగా బలం పెంచుకుని స్మార్టర్ ప్రత్యర్థిగా సవాళ్లు విసురుతున్నారు. చివరకు కొత్త ప్రధానిగా ఆయనే పీఠం ఎక్కనున్నారు.
ఉత్తర ఇంగ్లండ్‌లో అండీ బలమైన నేతగా ఉన్నప్పటికీ, బ్రిటన్‌లో రాజకీయ సుస్థిరత నెలకొంటుందని చెప్పలేని పరిస్థితి. బ్రెక్సిట్ తర్వాత బ్రిటన్‌లో ప్రధానుల మార్పు వేగంగా జరుగుతోంది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్, చివరకు స్మార్టర్… ఇలా దశాబ్ద కాలంలోనే ఆరుగురు మారిపోయి, ఏడవ నేతగా అండీ బర్న్‌హామ్ వస్తున్నారు.
దేశంలో జీవన వ్యయం పెరిగిపోవడం ప్రధానంగా అసంతృప్తికి దారితీసింది. వీటికి తోడు ప్రభుత్వాలపై అపనమ్మకంతో పెట్టుబడులు మందగించాయి. ఇప్పుడు అండీకి కూడా ఇవే సమస్యలు పెను సవాల్ విసరనున్నాయి. జాతీయ ఐక్యత, ఐరోపా దేశాలతో సంబంధాలు, ఆర్థిక మందగమనం ప్రధానంగా అండీకి ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించడం అంత తేలికేమీ కాదు. లేబర్ పార్టీని ఒక తాటిపై నడపగలిగితేనే వీటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం సాధ్యమవుతుంది. పార్టీ మద్దతు లేకుండా అండీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరన్నది స్పష్టం.
బ్రెక్సిట్‌తో బ్రిటన్ వృద్ధి రేటు తగ్గింది. ఐరోపా దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు కూడా 15 శాతం వరకు తగ్గాయి. సప్లై చైన్ దెబ్బతినడంతో రవాణా వ్యయం విపరీతంగా పెరిగింది. దీంతో ధరలు పెరిగి, ప్రజల జీవన వ్యయం అధికమైంది. అసంతృప్తి తీవ్ర రూపం దాల్చింది.
దేశీయ ఉత్పత్తి అయిదు శాతం వరకు తగ్గిందని గణాంకాలు చెబుతుండగా, ఉపాధి అవకాశాలు పడిపోయాయి. దీంతో రాజకీయ అస్థిరత పెరిగింది. ప్రధానులు వరుసగా మారిపోయారు. దాదాపు అన్ని రంగాలు నేడు చతికిలపడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆటో, ఫుడ్ ప్రాసెసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, హాస్పిటాలిటీ రంగాలు బాగా దెబ్బతిన్నాయి.
ఇక పాస్‌పోర్టింగ్ రైట్స్ కోల్పోవడంతో ఫైనాన్షియల్ సర్వీసెస్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐరోపా దేశాల నుంచి లేబర్ మైగ్రేషన్‌కు బ్రేక్ పడింది. దీంతో లేబర్ షార్టేజ్ ఏర్పడి వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపింది. ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఇవన్నీ ఒకదానికొకటి జతకాగా, కోవిడ్ దెబ్బకు మొత్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి.
ఈ స్థితిలో రాజకీయ సుస్థిరత సాధించకుండా ప్రధాని మారినంత మాత్రాన ఫలితం పెద్దగా ఉండదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా నిలదొక్కుకుని, తిరిగి ఆయా రంగాలను గాడిలో పెట్టగలిగితేనే బ్రిటన్ మళ్లీ అగ్రరాజ్యంగా నిలవగలదని భావిస్తున్నారు. ఈలోగా అక్కడ కొన్ని ప్రాంతాల నుంచి, ముఖ్యంగా స్కాట్లండ్ నుంచి స్వతంత్ర గళాలు బిగ్గరగానే వినిపిస్తున్నాయి.
