పలు ప్రాంతాలలో ఆదివారం కరెంట్ కష్టాలు…

పలు ప్రాంతాలలో ఆదివారం కరెంట్ కష్టాలు…

మూడు వారాలుగా ఆదివారం వచ్చిందంటే కరెంట్ ఉండదంటున్న ఆ ప్రాంత వాసులు…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరెంటు కోతలు ఉండవని తెలుపుతున్నప్పటికీ నంద్యాల ప్రాంతంలోని పలు ప్రాంతాలలో ఆదివారం వచ్చిందంటే చాలు పగలంతా కరెంటు తీసివేయటం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల పట్టణం శ్రీనివాసనగర్, సంజీవ్ నగర్ తో పాటు పలు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఆదివారం కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. గత మూడు వారాలుగా ఆదివారం వచ్చిందంటే ఆ ప్రాంత వాసులు కరెంట్ కష్టాలు అనుభవిస్తున్నారు.

ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు కరెంట్ ఉండదని ఆ ప్రాంత వాసులు వాపోటం విశేషం. కొందరు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ మరమ్మతులకు మూడవ శనివారం కరెంట్ తీయడం మామూలే. విద్యుత్ సరఫరా నిలుపుదల చేసేటప్పుడు ప్రజలకు సమాచారం అప్పుడప్పుడు ఇచ్చేవారు. అనధికారికంగా, సమాచారం ఇవ్వకుండా గత మూడు ఆదివారాలనుంచి కరెంట్ తీసివేస్తున్నారు.

పిర్యాదు చేయాలంటే ఫోన్లు పని చేసిన ఎవరు స్పందించడం లేదని వాపోతున్నారు. రెండు రోజులు కరెంట్ బిల్లు కట్టకపోతే వెంటనే వచ్చి కట్ చేసే సిబ్బంది, విద్యుత్ సమస్య వస్తె మాత్రం పట్టించుకోరు. విద్యుత్ కార్యాలయం కు వచ్చి ఎవరైనా పిర్యాదు చేయాలంటే కొందరు సిబ్బంది నిర్లక్ష సమాధానం ఇస్తున్నారని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలా మంది పిల్లలతో కలసి ఉంటారు. వారం రోజులు కస్టపడి ఆదివారం కోసం ఎదురుచూసే వారికి కరెంట్ కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. కనీసం సమాచారం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కరెంట్ కష్టాలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. సమంత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.