Murder | రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘ‌ట‌న‌

Murder | రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘ‌ట‌న‌

Murder | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో మహిళ దారుణ హత్య గురైంది. ఫరూక్‌నగర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31)కు మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ గ్రామానికి చెందిన రాజుతో 10 సంవత్సరాల క్రితం జరిగింది. అదే గ్రామానికి చెందిన నరసింహులుతో శోభారాణికి అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగా సాగిన వీరి వివాహ బంధంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నెలరోజుల క్రితం శోభారాణి భర్త రాజును వదిలేసి తన ఇద్దరు పిల్లలతో కలిసి తన తల్లిగారింటికి వచ్చింది. అప్పటి నుంచి నరసింహులు శోభారాణి ని వివాహం చేసుకుంటానన‌డంతో ఆగ్రహానికి గురైన భర్త రాజు శోభారాణిని శనివారం రాత్రి అత్యంత దారుణంగా చంపి రంగారెడ్డి గూడా – తంగడపల్లి రహదారిలో చెట్ల పొదల్లో పడేశాడు.

ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు గోవిందుకు చిన్నారి రోదిస్తూ కనిపించింది. ఏమి జరిగిందని ఆరా తీసేందుకు ప్రయత్నించగా ఓ మహిళ శవం కనిపించింది. రైతు వెంటనే జరిగిన విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. శోభారాణి కూతురు మూడేళ్ల చిన్నారి తల్లి మృతదేహం వద్ద రాత్రంతా రోదిస్తుండటం చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న షాద్ నగర్ సీఐ సీతారాం సంఘటన స్థలానికి సిబ్బందితో చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply