సత్తెనపల్లిలో అగ్ని ప్రమాదం..
సత్తెనపల్లిలో అగ్ని ప్రమాదం..
అప్రమత్తమైన సిబ్బంది..
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : సత్తెనపల్లిలో బుధవారం విద్యుత్ కార్యాలయం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ తీగల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి, సమీపంలోని కరెంట్ కాటేజ్ వైపు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనను గమనించిన విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో స్పందించిన అధికారుల చర్యలతో ఎటువంటి ప్రాణ నష్టం… ఆస్తి నష్టం జరగకుండా పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు విద్యుత్ శాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది చురుకైన చర్యలను అభినందించారు.
