నేడు ముగియనున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్”…!

నేడు ముగియనున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్”…!

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు…!

పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : “స్వచ్ఛ- ఆంధ్ర” దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ముగింపు కార్యక్రమానికి పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం, లింగంగుంట్ల గ్రామం వేదిక కానుంది. పరిశుభ్రమైన వీధులు, ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో పాల్గొననున్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం మనమంతా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతకు మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం…. అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల పిలుపునిచ్చారు.

పల్నాడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్ ఇది…

  • ఉదయం 11:55 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరు.
  • మధ్యాహ్నం 12:15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల హెలిప్యాడ్‌కు చేరిక. *12:15 నుంచి 12:25 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల స్వాగత కార్యక్రమం.
  • 12:30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకుని పరిశీలన.
  • 12:30 నుంచి 12:45 వరకు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన.
  • 12:50 గంటలకు రైతులతో ముఖాముఖి కార్యక్రమ వేదికకు చేరిక.
  • 12:50 నుంచి 01:20 వరకు రైతులతో ప్రత్యక్షంగా చర్చలు, సమస్యలపై అవగాహన.
  • 01:25 నుంచి 02:10 వరకు రిజర్వ్ సమయం.
  • 02:15 గంటలకు కేడర్ సమావేశ వేదికకు చేరిక.
  • 02:15 నుంచి 03:45 వరకు టీడీపీ కేడర్ సమావేశంలో పాల్గొనడం.
  • 03:50 గంటలకు ప్రజావేదిక సమావేశ ప్రాంగణానికి చేరిక.
  • 03:50 నుంచి 05:45 వరకు ప్రజావేదిక సమావేశంలో పాల్గొని ప్రసంగం.
  • 05:55 గంటలకు లింగంగుంట్ల హెలిప్యాడ్‌కు చేరిక.
  • 06:00 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం.
  • 06:20 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరిక.