జాబ్ క్యాలెండర్ విడుదల పట్ల హర్షం..
దర్శి, ఆంధ్రప్రభ: ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల పండుగను ప్రకటించడం పట్ల దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం ఆనందకరమైన విషయమన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తేదీలు, పోస్టుల వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు.
యువత భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఈ ఉగాది ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపేలా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆమె తెలిపారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఉద్యోగాల ప్రకటన పండుగగా నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించడం మరింత సంతోషకరమన్నారు.
