Ap-Alternative-Crops : ప్ర‌త్యామ్నాయం త‌ప్ప‌దు Andhra Prabha Top Story

Ap-Alternative-Crops : ప్ర‌త్యామ్నాయం త‌ప్ప‌దు Andhra Prabha Top Story

  • ఎల్ నినోతో అంతులేని క‌ష్టం
  • వ‌ర్షాలు స‌రిపోవు
  • ప్రాజెక్టులు నిండ‌వు
  • ల‌క్ష‌లాది ఎక‌రాల్లో సాగు క‌ష్టం
  • ప‌శుగ్రాసం సంక్షోభం త‌ప్ప‌దు
  • 5 నెల‌లు ఇబ్బంది ఉండ‌దు
  • ప్ర‌త్యామ్నాయం త‌ప్ప‌దు
  • ప‌స‌ల్ బీమా యోజ‌న దిక్కు
  • ఆగ‌స్టు 31 వ‌ర‌కూ న‌మోదు ప్ర‌క్రియ‌
  • ఏపీ సీఎంకు అధికారుల వివ‌ర‌ణ‌

( ఆంధ్ర‌ప్ర‌భ‌, అమ‌రావ‌తి )

Ap-Alternative-Crops : ఏపీలో అంచ‌నాల‌కు మించిన రీతిలో ఎల్ నినో ప్ర‌భావం క‌న‌ప‌డుతోంద‌ని, అన్ని జిల్లాల‌పై ఎల్ నినో ప్ర‌భావం ఉంద‌ని, ప్ర‌ధానంగా.. ఐదు జిల్లాల్లో తీవ్ర క‌ర‌వు ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు అధికారులు వివ‌రించారు. వ‌ర్ష‌సాతం గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని. న‌వంబ‌ర్ నాటికి మ‌రింతగా వ‌ర్ష‌పాతం లోటు పెరుగుతుంద‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ల‌క్ష‌లాది ఎక‌రాల్లో ప‌త్తి, వ‌రి పంట‌ల సాగు క‌ష్ట‌మ‌ని ఆఫీస‌ర్లు వివ‌రించారు. ఈ స్థితిలో .. ప్ర‌త్యామ్న‌య ఏర్పాట్లపై సీఎం చంద్ర‌బాబు నాయుడు దృష్టి సారించారు. ఏపీలో ఎల్‌నినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు. తెలిపారు. వచ్చే మూడు నెలల్లో సరాసరి 35 నుంచి 40 శాత మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంద‌ని అధికారులు వివ‌రంచారు. జూన్ నుంచి నవంబర్ మధ్య 844 మి.మీ వర్షపాతం నమోదుకావాలి. కానీ 551 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివ‌రించారు. అంచనాలకు మించి ఎల్‌నినో ప్రభావం ఉండబోతుందని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
కృష్ణా, గోదావరి బేసిన్లలో ఎగువ రాష్ట్రాల నుంచి జలాలు వచ్చే అవకాశంపై సీఎం ఆరా తీశారు. అన్ని జిల్లాల్లోనూ ఎల్‌నినో ప్రభావం చూపిస్తోందని, ఎక్కువగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితిలు నెలకొంటాయని అధికారులు హెచ్చిరించారు, . 2.78 లక్షల హెక్టార్లలో పత్తి, 1.07 లక్షల హెక్టార్లలో వరిపై ప్రభావం చూపిస్తుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు


శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. .వంశధార నుంచి జలాలు తరలించి పంటలను కాపాడేలా ప్రయత్నించాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో 122 రిస్క్ మండలాలను గుర్తించినట్లు అధికారులు తులిపారు. హై రిస్క్ మండలాల్లో బోరు ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
ఆగస్ట్ 3 నుంచి అవగాహన కార్యక్రమాలు, వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి, అత్యవసర విత్తన ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు. తెలిపారు. ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఈ నెల 31వ తేదీ వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వివ‌రించారు. వరి పంటకు ఆగస్ట్ 15 వరకు సమయం ఉందన్న అధికారులు వివ‌రించారు.
పశు గ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామ‌ని 5 నెలలకు సరిపడా 286.30 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉంచామని అధికారులు వివరించారు. వ్యవసాయ, ఉద్యాన, హార్టికల్చర్, పశుసంవర్ధక, ఇరిగేషన్ శాఖల అధికారులు సమీక్షకు హాజరు కాగా, జూమ్ ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షలో పాల్గొన్నాడు.