Madras HighCourt | బలపరీక్ష ఓటింగ్‌లో పాల్గొనొద్దని ఆదేశం

Madras HighCourt | బలపరీక్ష ఓటింగ్‌లో పాల్గొనొద్దని ఆదేశం
Madras HighCourt | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుపత్తూర్ నియోజకవర్గం నుంచి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన శ్రీనివాస సేతుపతికి మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీవీకే ప్రభుత్వ బలపరీక్ష ఓటింగ్‌లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి బలపరీక్షలో ఒక ఓటు తగ్గనున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాట్లు జరిగాయని ఆరోపిస్తూ డీఎంకే నేత, సమీప అభ్యర్థి పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాస సేతుపతిని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించకుండా నిలువరించాలని పిటిషన్‌లో కోరినట్లు సమాచారం.
ఈ వ్యవహారాన్ని విచారించిన మద్రాసు హైకోర్టు తాత్కాలికంగా బలపరీక్ష ఓటింగ్‌లో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేసింది. దీంతో అసెంబ్లీలో టీవీకే బలపరీక్ష గణాంకాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
