చిట్యాలలో హిందూ సమ్మేళన కార్యక్రమాల పోస్టర్ల ఆవిష్కరణ

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల పట్టణంలో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు గ్రీన్ గ్రో స్కూల్‌లో నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను శుక్రవారం స్థానిక శివాలయంలో సమితి సభ్యులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ ఉదయం 5 గంటలకు కనకదుర్గ ఆలయం నుండి నగర సంకీర్తన ప్రారంభమవుతుందని తెలిపారు. 4వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రతి ఇంటిపై భగవద్ధ్వజం (కాషాయ జెండా) ఎగురవేయాలని, అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపారాధన నిర్వహించాలని సూచించారు.

అలాగే, 5వ తేదీ హిందూ సమ్మేళనం రోజున సాయంత్రం 5 గంటలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ నుంచి గ్రీన్ గ్రో స్కూల్ వరకు శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరసింహారెడ్డి, అధ్యక్షుడు తెరెటుపల్లి హనుమంతు, ప్రధాన కార్యదర్శి ఏళ్ల అనంతరెడ్డి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply