Criminal Records | ఫింగర్ ప్రింట్ డివైస్, తనిఖీలు

Criminal Records | ఫింగర్ ప్రింట్ డివైస్, తనిఖీలు

Criminal Records | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ముందస్తు నేరాల నియంత్రణలో భాగంగా దొంగతనాల నివారణనే లక్ష్యంగా, పాత నేరస్తులను గుర్తించడానికి బ్లూ కోర్ట్స్ పోలీసులు(Blue Courts Police) ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఊట్కూర్ ఎస్ఐ రమేష్ అన్నారు. ఈ రోజు నారాయణపేట ఎస్పీ ఆదేశాల మేరకు ఊట్కూర్ ఎస్బిఐ బ్యాంక్ వద్ద, ప్రధాన చౌరస్తాలలో ఊట్కూర్ పోలీసులు మాతృ నాయక్, రవిలు అకస్మికంగా ఫింగర్ ప్రింట్స్(Fingerprints) డివైస్ తో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను తగిన రీతిలో పరిశీలించి, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఫింగర్ ప్రింట్ డివైస్ తో వ్యక్తుల వేలిముద్రలు సేకరించి క్రిమినల్ రికార్డుల(Criminal Records)తో పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పౌరులు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే లోకల్ పోలీసులకు లేదా డయల్ 100కి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply