బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీను బలోపేతం చేయాలి..
బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీను బలోపేతం చేయాలి..
- కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ కమిటీల నియామక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయడంలో బూత్ కమిటీల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఈ నియామక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆకుల లచ్చన్న, ముస్కు రాజు, గోసుకుల మల్లేష్, తరి శంకర్, ఎండి సలీం, రాహుల్ గాంధీ ఫాలోవర్స్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, నారాయణ, భూమన్న, చంద్రశేఖర్, దుర్గం రాజేష్, నరేష్, ప్రసాద్, నలేం శీను, రమేష్ గౌడ్, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
