రైతుభ‌రోసా నిధుల పట్ల హ‌ర్షం

జన్నారం, ఆంధ్రప్రభ: రైతుల అకౌంట్లలో రైతు భ‌రోసా నిధులు జమ చేయడం, మండలంలోని పలు గ్రామాల రోడ్లకు నిధులు మంజూరు చేసినందుకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, వివేక్ వెంకటస్వామి, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చిత్రపటాలను ఏర్పాటు చేసి నేతలు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అజ్మీర నందునాయక్,పార్టీ జిల్లా ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, ఇసాక్,టౌన్ అధ్యక్షుడు మంద రాజేష్, నేతలు ముత్యం సతీష్,రియాజొద్దీన్, భూమేష్,ఎం.రాజన్న, సుధీర్, రజాక్,లక్ష్మణ్ , తదితరులు పాల్గొన్నారు.