నిజామాబాద్ నుంచి బదిలీపై వచ్చి బాధ్యతల స్వీకారం

నిజామాబాద్ నుంచి బదిలీపై వచ్చి బాధ్యతల స్వీకారం

​మేడ్చల్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌లోని ప్రముఖ గాంధీ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి (హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్)గా డాక్టర్ బి.వి. నాగమోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల నుండి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు.
​డా. నాగమోహన్ రావుకు ఫోరెన్సిక్ మెడిసిన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన 2016 సంవత్సరం నుండి నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతిగా సేవలందించారు. అక్కడ తన పదవీ కాలంలో ఆ విభాగం అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఆయన విశేష కృషి చేశారు.
​గాంధీ మెడికల్ కళాశాలలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనకు తోటి వైద్యులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డా. నాగమోహన్ రావు మాట్లాడుతూ… గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.