ఆశీర్వదించి గెలిపించండి

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో 7 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గనగాని శైలజ నర్సయ్య గౌడ్ శనివారం ఇంటింటికి తిరుగుతూ… మహిళలకు అభ్యర్థి శైలజ స్వయంగా బొట్టు పెట్టి ..ఓటర్లను అభ్యర్థిస్తున్నారు .7 వ వార్డులో తనకు ఒకసారి అవకాశం ఇచ్చి ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేయి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ గా గెలిపిస్తే… తమకున్న ప్రజాపతినిధి అనుభవంతో… వార్డులోని అన్ని సమస్యలకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.

వార్డులో సిసి రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ నిర్వహణ, వీధిలైట్లు, విద్యుత్ స్తంభాలు, వడ్డెర కాలనీలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కోసం కృషి చేస్తామని , డ్రైవర్స్ కాలనీలో త్వరలోనే సిసి రోడ్ పనులు ప్రారంభమవుతాయని , వార్డులోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించి.. మోత్కూర్ మున్సిపాలిటీలోనే 7 వ వార్డును ఆదర్శవార్దుగా తీర్చిదిద్దుతామని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నారు