confusion | గుర్తుల గుబులు

confusion | గుర్తుల గుబులు

గందరగోళానికి ఛాన్స్
అవకాశాలపై నీళ్లు
ఆందోళనలో అభ్యర్థులు

confusion

confusion | హైదరాబాద్, ఆంధ్రప్రభ: పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల తకరారు నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంతో శ్రమించి, ప్రజలకు నచ్చిన, శక్తికి మించిన హామీల తో ప్ర జల్లో మద్దతు కూడగట్టుకుంటున్నారు. కానీ, వారికి ఓటు వేసే గుర్తులను ఓటర్లకు చెప్పేందుకు ఎస్ఈసీ కేటా యించిన గుర్తులు అభ్యర్ధులకు కష్టతరమయ్యే అవకాశా లున్నాయి. ఈ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతుండగా, తొలిదశ పోలింగ్ కోసం సర్పంచ్లకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాన్ని, వార్డు సభ్యులకు తెలుపు రంగు సిద్ధం చేసింది. అలాగే గుర్తుల కేటాయింపు పూర్తైంది.

confusion | గుర్తులను ఎలా కేటాయిస్తారంటే…

నామినేషన్ల ఉపసంహరించిన తర్వాత, చివరిగా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారి సిద్ధం చేస్తారు. ఆ జాబితాలోని అభ్యర్థుల పేర్లలోని మొదటి అక్షరం ప్రకారంగా, అంటే నామినేషన్ దాఖలు సమర్పించిన పత్రాల్లో అభ్యర్థుల పేరు ఇంటిపేరుతో మొదలైతే దానిలోని మొదటి అక్షరాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇంటిపేరు లేనట్లయితే, అభ్యర్థి పేరులోని మొదటి అక్షరాన్ని ఆధారంగా నోటిఫై చేసిన గుర్తులను వరుస క్రమంలో అభ్యర్థులకు కేటాయిస్తారు.

confusion | అభ్యర్థుల్లో గుర్తుల గందరగోళం…

అయితే అభ్యర్థులకు కేటాయిస్తున్న గుర్తులు ఓటర్లను, అభ్యర్థులనూ అయోమయానికి గురిచేసేలా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల వారికి తెలిసే విధంగానే కేటాయించి నప్పటికీ, అవి ఇతర అభ్యర్థుల గుర్తులనూ పోలి ఉన్నాయి. దీంతో ఓటర్లు ఒక గుర్తుకు బదులు ఇంకో దానికి ఓటు వేసే ప్రమాదం ఉంది. ఇదే ప్రమాదముందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వారికివి అర్థమయ్యేనా?…
ప్రస్తుతం ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుల్లో బ్యాలెట్ పేపర్పై ముందుగా ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్ బాబాల్, లేడీ పర్సు, రిమోట్, టూత్పేస్టు, స్పానర్ గుర్తులు వరసగా ఉన్నాయి.

గ్రామాల్లో ఎక్కువగా నిరక్ష్యరాస్యులు, వయసుపై బడిన వారు ఉంటారు. వీరికి సులభంగా అర్థమయ్యే మంచం, చెప్పులు, పలక, కొబ్బరి చెట్టు వంటి గుర్తులను ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లో ఎక్కడో చివర్లో కేటాయించింది. అలాగే బ్యాలెట్ పేపర్లో చివరి గుర్తు వచ్చిన అభ్యర్థులు నిరక్ష్యరాస్యులకు వృద్ధులకు చెప్పడం కూడా ఇబ్బందికరంగా మారనుంది. ఎందుకంటే, చిట్టచివరికి నోటా గుర్తు ఉంటుంది. వారు వేసే ఓటును అభ్యర్థికి బదులు పొరపాటున నోటాకు వేసే ప్రమాదముంది.

confusion | గత ఎన్నికల్లో పరిశీలిస్తే…

భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గానికి 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థికి ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. అప్పడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీది కారు గుర్తు. ఈ ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థికి 27 వేల ఓట్లు పడ్డాయి. కారు గుర్తును పోలి ఉన్నందుకే ఆ ఓట్లు రావడానికి కారణమని ఓట్ల లెక్కింపు తర్వాత తేలింది. ఇదే విధంగానే దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా మరో స్వతంత్ర అభ్యర్థి ట్రక్కు గుర్తు కూడా కారు గుర్తును పోలి ఉండటంతో 3,570 ఓట్లు వచ్చాయి. గుర్తుల గందరగోళంతో నాయకులతో పాటు పార్టీల భవిష్యత్తును తలకిందులు చేసే అవకాశాలున్నాయి.


మిగతా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Click Hre To Read More