మూగజీవాలకు కూడా చలివేంద్రాలు కల్పించాలి….

మూగజీవాలకు కూడా చలివేంద్రాలు కల్పించాలి….
మదర్ తెరిసా సేవా సమితి గౌరవ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పురస్కరించుకుని మూగజీవాలైన పక్షులకు పశువులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మచిలీపట్నం నవచైతన్య మదర్ తెరిసా సేవాసమితి గౌరవ అధ్యక్షులు బాలాజీ పిలుపునిచ్చారు. సమితి 20 సంవత్సరాల వార్షికోత్సవం పురస్కరించుకుని శనివారం 15వ డివిజన్ నగరి చెన్నయ్య మార్కెట్లో చలివేంద్రాన్ని లంకి శెట్టి బాలాజీ మచిలీపట్నం మార్కెట్ మాజీ చైర్మన్ మరకాని పరబ్రహ్మంతో కలిసి ప్రారంభించారు.
గత 20 సంవత్సరాలుగా సమితి ఆధ్వర్యంలో కొన్ని వందల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి చిలకలపూడి సెంటర్లో ఎనిమిది అడుగుల మదర్ తెరిసా విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం సమితికి దక్కిందని బాలాజీ అన్నారు. సమితి ద్వారా అనేక రక్తదాన శిబిరాలు కుష్టువ్యాధి కలిగిన వారికి చేయూత 20 సంవత్సరాలుగా చలివేంద్రాలు ఏర్పాటు పేద విద్యార్థులకు ఫీజులు పుస్తకాలు అందించడం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించి సమితి గుర్తింపు పొందిందని బాలాజీ అన్నారు.
మదర్ తెరిసా స్ఫూర్తితో సమితి అధ్యక్ష కార్యదర్శులు పైడిపాముల గురు ప్రసాద్ కుమ్మరి జలా చంద్రుడు నిరంతరం సేవలందిస్తూ ప్రజలను పొందారని అన్నారు. సమితి సేవా కార్యక్రమాలను అధ్యక్షులు గురు ప్రసాద్ తెలియజేశారు. రాబోయే రోజులలో క్షేత్రస్థాయిలో పేదవారికి మరింత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని శిబిరాలు ఏర్పాటు చేస్తామని కార్యదర్శి జలచంద్రుడు అన్నారు. మరకాని పరబ్రహ్మం మాట్లాడుతూ… ఎవరి వద్ద చందాలు అడగకుండా తమ సొంత నిధులతో 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని అన్నారు.
గత 20 సంవత్సరాలుగా ప్రతి వేసవికి నగిరి చెన్నయ్య మార్కెట్లో క్రమం తప్పకుండా చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ కూల్ డ్రింక్స్ ను మంచినీళ్లను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా సమితిలో విశిష్ట సేవలు అందించిన 12 మందికి లంకిశెట్టి బాలాజీ మెమెంటోళ్లు అందజేసి రిక్షా కార్మికులకు కండువాలు పంపిణీ చేశారు. సమితి అధ్యక్షులు పైడిపాముల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
